ప్రవీణ గారు ఇలాంటివి మరెన్నో తీయాలి, రానా గారు సపోర్ట్ చేయాలి – హీరో మనోజ్ చంద్ర

Hero Manoj Chandra Says, Everyone Connected with My Role in Kothapallilo Okappudu

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రామకృష్ణ పాత్రతో మీరందరూ కనెక్ట్ అయ్యి ఎంకరేజ్ చేసిన విధానం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ పాత్రకి అందరూ కనెక్ట్ అయ్యారు. చాలామంది మెసేజ్‌లు పెట్టారు. ఇందులో అన్ని పాత్రలకు పర్సనల్‌గా రిలేట్ అయ్యారు.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కొత్త నటీనటులమైనా మా అందరినీ యాక్సెప్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. ప్రవీణ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానా గారు ఇలాంటి మరిన్ని సినిమాలకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలా చేయాలంటే మీరందరూ ధియేటర్స్‌కి వచ్చి సినిమాని సపోర్ట్ చేయాలి” అని అన్నారు.

ఇక ఫిమేల్ యాక్ట్రెస్ ఉషా బోనెల మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ప్రవీణ గారు నాకు ఈ అవకాశం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మనోజ్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

అలాగే మరో నటి మౌనిక మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ప్రవీణ గారికి ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్‌కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. మనస్పూర్తిగా నటించాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ గారికి ధన్యవాదాలు. టీం లో ప్రతి ఒక్కరికి థాంక్యూ. చాలా మంచి సినిమా ఇది తప్పకుండా థియేటర్స్‌లో చూడండి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.