పనిచేయడం తెలుసుకానీ, ప్రమోట్ చేసుకోవడం తెలియదు – పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan’s Speech Boosts Hype for Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికాల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా గ్రాండ్‌గా జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ, కెమెరామెన్ మనోజ్ పరమహంస మరియు చిత్ర నిర్మాత ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతోపాటు తోటి నటీనటులు, చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్స్ డెడికేషన్‌ని కొనియాడారు. అలాగే నిర్మాత ఏఎం రత్నం గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “నిర్మాత రత్నం గారు, డైరెక్టర్ క్రిష్ అద్భుతమైన కథతో నా దగ్గరకు వచ్చారు. విన్న వెంటనే ఎక్సయిట్ అయ్యి సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. అయితే అనుకోకుండా కరోనా రావడం, నేను రాజకీయాల్లో బిజీ కావడం వంటి పరిణామాలతో ఈ సినిమా మేము ఊహించినంత వేగంగా పూర్తిచేయలేకపోయాం. నాకు ఎంతగా సహకరించాలని ఉన్నా, పరిస్థితుల కారణంగా టైమ్ కేటాయించలేకపోయాను.”

“అయితే కొన్ని అనివార్య కారణాలతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అందుకు ఆయనను తప్పు పట్టడంలేదు. ఈ సినిమా ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చిందంటే ఆయనే ముఖ్య కారణం. ఇక ఈ సినిమా ఆగిపోయినట్టే అని అందరూ భావించారు. ఒక సమయంలో నాకు కూడా అదే అనిపించింది. కానీ, ఆ సమయంలో డైరెక్టర్ జ్యోతికృష్ణ వండర్ ఫుల్ విజన్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నన్ను కలిసినప్పుడు ఆయన డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను.”

“జ్యోతికృష్ణ మొదట నాకు ఏదైతే చెప్పారో.. చివరకు అలాంటి అవుట్ ఫుట్‌నే ఇచ్చారు. రేపు మీరు థియేటర్లలో సినిమాను చూసిన తర్వాత ఆయన ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేరు. ఇక నేను ముఖ్యంగా చెప్పాల్సింది, హీరోయిన్ నిధి గురించి. సినిమా పూర్తయ్యాక వదిలేయకుండా, మూవీ ప్రమోషన్స్‌ను ఒక్కర్తే తన భుజంపై వేసుకుని నిర్వహిస్తోంది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. ఒక ఆడపిల్ల అలా చేస్తుండటం చూసి, సినిమాని అనాథలా వదల్లేక అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను.”

“అలాగే అందరికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిర్మాత రత్నం గారి గురించి. ఒక మేకప్ మెన్‌గా కెరీర్ ప్రారంభించి ఈరోజు దేశం గర్వించే స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 1990ల దశకంలోనే ఆయన పాన్ ఇండియా మూవీస్ ఎన్నింటినో నిర్మించారు. ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, దర్శకులు ఎదురుచూసే రోజులు నాకు తెలుసు. గతంలో ఆయనతో ‘ఖుషి’ చేశాను. చాలా కంఫర్ట్ ఇచ్చారు.”

“ఇప్పుడు మళ్ళీ నాతో సినిమా తీసేందుకు వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. రత్నం గారు చాలా గొప్ప మనిషి, మంచి మనిషి. అందుకే ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన పేరుని సీఎం చంద్రబాబుకి సిఫార్స్ చేశాను. త్వరలోనే ఆయనను ఆ పదవిలో చూడొచ్చు అని భావిస్తున్నాను. నాకు పనిచేయడం తెలుసుకానీ, ప్రమోట్ చేసుకోవడం తెలియదు. కానీ, ఈరోజు కేవలం రత్నం గారి కోసమే ఇక్కడకి వచ్చాను.” అని ముగించారు పవన్ కళ్యాణ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.