కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ అందించారు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్స్ అయిన ఈ వీడియో ఒక సినిమాటిక్ ఫెస్టివల్‌లా కనిపిస్తుంది. కేవలం బీహైండ్ ది సీన్స్ అనిపించకుండా సినిమా పుట్టిన తీరుని అద్భుతంగా చూపించారు. విభిన్న భూభాగాలు, కాంప్లెక్స్ సెటప్లలో పనిచేసే భారీ టీం కలిగి ఉన్న ఈ వీడియో రిషబ్ శెట్టి డెడికేషన్‌కు ట్రీబ్యూట్లా వుంది.
భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన మూవీస్ అందించాలనే విజన్‌తో సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ హోంబాలే ఫిల్మ్స్‌లో వచ్చిన ‘కాంతార’ వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. రిషభ్ శెట్టి ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తోన్న కాంతార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు.
సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న బి. అజనీష్ లోకనాథ్ ఆల్రెడీ తన స్పిరిచువల్ టచ్ తో అద్భుతం అనిపించారు. డివోషనల్ విజువల్స్ ను ఆర్ట్ డైరెక్టర్ వినేష్ బంగ్లాన్ అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ విషయంలో అరవింద్ కాశ్యప్ వర్క్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అక్టోబర్ 2న గ్లోబల్ రిలీజ్ కానున్న ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రానుంది. గాంధీ జయంతి, దసరా హాలిడేస్ కలిసి వస్తుండటం కలిసొచ్చే అంశం.
అయితే రిషబ్ శెట్టి ఈ సినిమాతో పాటు ప్రస్తుతం తెలుగులో ‘జై హనుమాన్’లో కూడా నటిస్తున్నాడు.హనుమాన్కు సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దీనితోపాటు మరాఠా వీరుడు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ సినిమాలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడు రిషబ్ శెట్టి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































