కొత్తపల్లిలో ఒకప్పుడు.. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా – ప్రవీణ పరుచూరి

Kothapallilo Okappudu Deserves A Theatre Experience, Says Director Praveena Paruchuri

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ థాంక్యూ మీట్‌లో డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం. సినిమాని రిలీజ్ చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం ఇంకా పెద్ద టాస్క్. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఆడియన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఒక నమ్మకం గురించిన కథ ఇది. ఒక లైట్ హార్టెడ్ కామెడీతో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం జరిగింది. ఉష నేచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఈ సినిమాలో తీసుకున్నాం. వర్క్ షాప్స్ కూడా చేయించాం. రామకృష్ణ, ఉష పాత్రలకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వారు నా నమ్మకాన్ని నిలబెట్టారు. నటులు కావాలని వాళ్ళ కలని మీరందరూ నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మరిన్ని అవకాశాలు వారికి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.