మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ మూవీకి సంబంధించి సెట్స్ నుండి లీకైన ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయవద్దని, అలాగే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అనధికారికంగా కంటెంట్‌ను రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం వంటివి చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. అందులో.. “మేము గమనించాము మెగా 157 సినిమా సెట్స్ నుండి అనధికారికంగా వీడియోలు మరియు ఫోటోలు తీసి, సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇది మాకు చాలా నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనగా, మేధస్సు హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నాము.”
“అందువల్ల, సరైన అనుమతి లేకుండా సినిమా సెట్స్ నుండి ఏ విధమైన కంటెంట్‌ను తీసేందుకు లేదా షేర్ చేయేందుకు ఎవ్వరూ యత్నించకండని మనవి. ఇలా చేయడం వల్ల కేవలం సృజనాత్మక ప్రక్రియకు ఆటంకం కలగడమే కాకుండా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై తీవ్రంగా శ్రమిస్తున్న టీమ్ యొక్క కృషిని కూడా దెబ్బతీస్తుంది.”
“ఇంకా, లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయడం, అప్‌లోడ్ చేయడం, పంచుకోవడం చేసిన ఏ వ్యక్తి లేదా ప్లాట్‌ఫారమ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇవి కాపీరైట్ ఉల్లంఘన మరియు యాంటీ-పైరసీ చట్టాల పరిధిలోకి వస్తాయి.”
“మెగా 157 (#చిరు-అనిల్) అనే ఈ చిత్రాన్ని మేము ఎంతో ప్రేమతో, శ్రద్ధతో నిర్మిస్తున్నాము. ఫ్యాన్స్ మరియు మీడియా సంస్థలందరినీ మేము ప్రార్థిస్తున్నాము — అధికారికంగా మేకర్స్ విడుదల చేసే అప్‌డేట్స్ కోసం మాత్రమే వేచి ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాము.”
“ఈ ప్రాజెక్ట్ యొక్క ఉత్సాహాన్ని, అర్థవంతమైన ప్రయాణాన్ని కాపాడేందుకు మనమందరం కలసి పనిచేద్దాం. మీ అర్థవంతమైన సహకారం, సహనం, మద్దతుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని పేర్కొన్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























