నువ్వుంటే చాలే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

Nuvvunte Chaley song receives a superb response

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజైన సంగతి తెలిసిందే.మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.24 గంటల్లోపే 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.సాంగ్ విన్న వారి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.రామ్ ఈసాంగ్ ను రచించడం విశేషం.ఫస్ట్ టైం ఈ పాట తో రామ్ లిరిసిస్ట్ గా మారాడు.ఇక మొదటి సాంగ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు.అనిరుధ్ వాయిస్ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వినేట్లు చేసింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.దాదాపు నెలరోజుల పైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా వివేక్- మెర్విన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.