ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది. దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.రామ్ ఈసాంగ్ ను రచించడం అలాగే అనిరుధ్ పాడడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసాంగ్ ఆ అంచనాలను అందుకొని చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అనేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నువ్వు ఉంటేచాలే అంటూ సాగే ఈ సాంగ్ రిపీట్ లో వినేలా వుంది.హీరోగా కానే కాదు లిరిసిస్ట్ గా కూడా రామ్ అదరగొట్టాడు. అర్ధవంతమైన లిరిక్స్ తో ప్రేమను వ్యక్తపరుస్తూ చాలా బాగా రాసుకున్నాడు.వివేక్ -మెర్విన్ ట్యూన్స్, అనిరుధ్ వోకల్స్ ఫ్రెష్ ఫీల్ తెప్పించాయి.ఓవరాల్ గా ఫస్ట్ సింగిల్ తో సినిమాపై బజ్ మరింత పెరగనుంది.
మహేష్ బాబు పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక రామ్ చివరి సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.ఇప్పుడు ఇక తన కంఫర్ట్ జోన్ లో సినిమా చేస్తున్నాడు.సో ఆంధ్ర కింగ్ తాలూకా తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావడానికి రామ్ కు ఇదే మంచి అవకాశం.సినిమా కూడా బాగా వస్తుందన్న టాక్ వినిపిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























