మెగాస్టార్ చిరంజీవి – బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25 నుండి స్టార్ట్ చేయనున్నారు.ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా స్టోరీ లైన్ ను రివీల్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. మనకు మొత్తం 14 లోకాలు వున్నాయి .అందులో 7 కిందవుంటే ,మరో 7 పైన ఉంటాయి.విశ్వంభరలో 14 లోకాలు చూపించనున్నాం. హీరో 14వ లోకంసం వెళ్లి హీరోయిన్ ను ఎలా సాధించుకున్నాడు అనేదే కథ అంటూ తాజాగా జరిగిన ఇంటర్వ్య లో వెల్లడించాడు. స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అలాగే విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయని అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని కూడా వశిష్ఠ క్లారిటీ ఇచ్చాడు.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం మెగా 157(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు.ఈసినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























