కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్, సత్య రాజ్ మలయాళ నటుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా రజినీ బర్త్ డే సందర్భంగా ‘చికిటు వైబ్’ పేరుతో విడుదలచేసిన స్పెషల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు పాటలను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్నాయి. వీటిలో రీసెంట్గా రిలీజ్ చేసిన పూజా హెగ్డే మెరిసిన ‘మోనికా’ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కూలీ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుండి థర్డ్ సింగిల్ రానుంది. ‘పవర్‌హౌస్’ అంటూ సాగే ఈ పాట ఓ రేంజ్లో ఉండనుంది. కాగా ఈ మూడో పాటను హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ నగరంలోని క్వేక్ ఎరీనాలో జూలై 22 రాత్రి 9:30కు అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
కాగా సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన కూలీ దాదాపు రూ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇక ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 14న కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























