హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఇంకా ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో టీజర్ ను రిలీజ్ చేశారు అంతే ఇక అప్పటి నుండి మరో అప్డేట్ రాలేదు.అయితే ఇక ఎట్టకేలకు కీలమైన అప్డేట్ ఇవ్వనున్నారు. అదే ట్రైలర్ అప్డేట్. ఈనెల 23న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ లెంగ్త్ కూడా రివీల్ అయ్యింది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.ట్రైలర్ తో సినిమా హైప్ మరింతగా పెరగనుంది.అయితే ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ఈసినిమాను టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ విడుదలచేస్తున్నాడు.భారీ ధరకు ఈ రైట్స్ దక్కించుకున్నాడు.బ్రేక్ ఈవెన్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది. అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా హిందీ ,తెలుగు తోపాటు తమిళం లోకూడా విడుదలకానుంది.
అయితే వార్ 2 విడుదలవుతున్న రోజు లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























