పరదా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు – డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Producer Suresh Babu Got Emotional After Watching Paradha, Director Praveen Kandregula

‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల ‘శుభం’ సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరదా’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ఇక రిలీజ్ డేట్ అండ్ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌కి హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. “సురేష్ బాబు గారికి థాంక్యూ సో మచ్. సురేష్ బాబు గారు మాకు ఇన్స్పిరేషన్. సురేష్ బాబు గారికి సినిమాలు అంత ఈజీగా నచ్చవు. కానీ ఈ సినిమా చూసి కంట నీరు పెట్టుకున్నారు. సత్యదేవ్ గారు సాంగ్ ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “గోపీసుందర్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలో పాటలన్నీ మనసుకి హత్తుకుంటున్నాయి. సినిమా బండి, శుభం తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా చేశాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలి. మాకిది బాహుబలి లాంటి సినిమా. తప్పకుండా మా సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేస్తారని మన ఆశిస్తున్నాను. థాంక్యూ సో మచ్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.