‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల ‘శుభం’ సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరదా’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ఇక రిలీజ్ డేట్ అండ్ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌కి హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. చాలా అద్భుతమైన డేట్ అది. మన మెగాస్టార్ గారి బర్త్ డే. అంతకుమించి మంచి డేట్ దొరకదు. కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. సురేష్ బాబు గారు మంచి సినిమాని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా నిర్మాతలతో నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను. చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “డైరెక్టర్ ప్రవీణ్‌కి ఈ సినిమా మరెన్నో అద్భుతమైన అవకాశాల్ని తీసుకొస్తుంది. అనుపమ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి. ఇలాంటి సినిమాలు సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























