పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వచ్చే వారమే థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ నిర్వహించనున్నారు.ఈనెల 21న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ ఈవెంట్ జరుగనుంది.దీనికి పవన్ తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ కి తోడు తెలుగులో చాలా రోజుల తరువాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో హరి హర వీరమల్లుపై భారీ అంచనాలు వున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా టికెట్ హైక్ తో రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత పవన్ నెక్స్ట్ ఓజీ తో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.సుజీత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న విడుదలకానుంది.దాంతో మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో రానున్నాడు పవన్.ఇక ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నాడు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈనెలలో పవన్ షూటింగ్ ఫినిష్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























