దిల్ రాజు అందిస్తోన్న మరో డిఫరెంట్ ఫిల్మ్

Sri Venkateswara Creations Releasing Ekka Movie in AP and Telangana

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకవైపు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు ఇతర బ్యానర్లలో తెరకెక్కిన మంచి చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇతర భాషలలో రూపొందిన కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ‘ఎక్కా’ అనే ఒక కన్నడ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు సమాయత్తమైంది. జూలై 18న ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో గ్రాండ్‌గా విడుదలచేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘ఎక్కా’ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ కన్నడ చిత్రానికి రోహిత్ పడాకి దర్శకత్వం వహించాడు. 2024లో ‘యువ’ సినిమాతో అరంగేట్రం చేసిన యువ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సంపద, సంజన ఆనంద్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటించగా, అతుల్ కులకర్ణి, ఆదిత్య, శృతి కృష్ణ, పూర్ణచంద్ర మైసూర్, పునీత్ రుద్రనాగ్, రాహుల్ దేవ్ శెట్టి, సాదు కోకిల, హరీణి శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చగా.. సినిమాటోగ్రఫీ అందించాడు. సత్య పి. హెగ్డే, మరియు దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ చేశారు. ఎక్కా సినిమాను పీఆర్‌కే ప్రొడక్షన్స్, జయన్న ఫిలింస్ & కేఆర్‌జీ స్టూడియోస్ బ్యానర్లపై అశ్విని పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ మరియు యోగి జీ రాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. డైరెక్టర్ రోహిత్ పడాకి మరియు విక్రమ్ హత్వార్ సంయుక్తంగా కథను అందించారు. బెంగళూరులో జరిగిన ఒక యదార్థ గాథకు వెండితెర రూపాన్ని ఇస్తున్నట్టు ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.