కిరీటీ, శ్రీలీల నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు – జెనీలియా

Actress Genelia Praises Junior Hero Kireeti and Heroine Sreeleela

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నటి జెనీలియా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కన్నడలో నా లాస్ట్ సినిమా శివ రాజ్‌కుమార్ గారితో చేశాను. అది నాకు చాలా స్పెషల్ ఫిలిం. మళ్లీ ఇప్పుడు ‘జూనియర్’తో ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత సాయి గారు చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దారు.”

“కిరీటి ఒక న్యూ కమ్మర్ లాగా అనిపించడం లేదు. తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ డాన్స్ అద్భుతంగా ఉన్నాయి. కిరీటీ, శ్రీలీల నాకు న్యూ కమర్స్ లాగా అనిపించలేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు. కిరీటి వండర్‌ఫుల్‌ యాక్టర్. శ్రీల బ్యూటిఫుల్ డాన్సర్. రాధా గారు వండర్‌ఫుల్‌ డైరెక్టర్. ఆయన మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. జూలై 18న సినిమాను థియేటర్స్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.