ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రామాయణం’. ‘కేజీఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారతీయ గొప్ప ఇతిహాసం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే రామాయణం నుంచి మేకర్స్ ‘ద ఇంట్రడక్షన్’ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేసేసింది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గల మూవీ లవర్స్ అందరి దృష్టిని ఇది అమితంగా ఆకర్షించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కై లెవెల్‌కి చేరుకున్నాయి. మన పురాణాలపై అంతగా అవగాహనలేని విదేశీయులను సైతం ఈ గ్లింప్స్ విశేషంగా అలరించింది.
ఈ నేపథ్యంలో రామాయణం సినిమాకి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఎవరూ ఊహించని బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తద్వారా ఇప్పటివరకూ ఇండియాలో నిర్మితమైన చిత్రాలలో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఇది రికార్డులకెక్కనుంది. ఇంతకూ ఈ సినిమా బడ్జెట్ ఎంతో గెస్ చేయగలరా? 500 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.4,000 కోట్లు. షాకింగ్‌గా ఉందా? అవును మీరు విన్నది నిజమే.
రామాయణం రెండు పార్టులకు కలిపి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతోంది. దీనిని స్వయంగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రామాయణం నాతో పాటు భారతీయులందరూ గర్వించే ప్రాజెక్ట్ అవుతుంది. హాలీవుడ్ సినిమాలతో పోటీపడే స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. అందుకే సినిమాకి ఎంతో ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్, విజువల్స్, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. ” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించడానికి అవసరమైన నిధుల విషయం గురించి మాట్లాడుతూ.. “అయితే ఈ చిత్రం కోసం అవసరమైన ధనం నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. నా సొంత ఫైనాన్షియల్ సోర్సెస్ నుంచే పెట్టుబడి పెడుతున్నాను. అందుకే ఈ నెంబర్స్ బహిరంగంగా చెప్పగలుగుతున్నా’’ అని పేర్కొన్నారు. కాగా నటుడు యష్ ఈ సినిమాకి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఆయన హోం బ్యానర్ ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ ఒక భాగస్వామిగా ఉంది.
ఇటీవలే రామాయణం ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తవగా, విడుదలకు ఇంకా ఒక ఏడాది సమయం పట్టనుండటం గమనార్హం. అంటే, కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే మేకర్స్ ఒక సంవత్సరం కేటాయించనున్నారు. దీనిని బట్టే ఈ చిత్రం ఏ స్థాయిలో రూపొందనుందో ప్రేక్షకులు అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమా హాలీవుడ్ మరియు భారతదేశంలోని ట్యాలెంటెడ్ టెక్నీషియన్స్ ప్రతిభతో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రూపొందుతోంది.
ఇక ఈ సినిమా కోసం 8 సార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న VFX స్టూడియో DNEGతో కలిసి ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. ఈ కంపెనీకి నమిత్ మల్హోత్రా సీఈఓ కావడం విశేషం. ప్రేక్షకులకు గొప్ప IMAX ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ప్రత్యేకంగా చిత్రీకరించబడుతోన్న రామాయణం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
అయితే ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాను ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో.. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు చరిత్ర సృష్టిస్తుందో, వేచి చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























