సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ త్వరలో రిలీజ్

Santosh Soban Birthday Poster Released From Couple Friendly

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన UV క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన UV కాన్సెప్ట్స్ పతాకంపై ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘కపుల్ ఫ్రెండ్లీ’. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొన్నిరోజులక్రితం ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే నేడు హీరో సంతోష్ శోభన్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కపుల్ ఫ్రెండ్లీ నుంచి తాజాగా ఆయన బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఈ పోస్టర్‌లో సంతోష్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా కోసం ఆదిత్య రవీంద్రన్ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తుండగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే గణేష్ శివ ఎడిటింగ్‌, మైఖేల్ BFA కళా దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు అజ‌య్ కుమార్.పి కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా పూర్తిచేసి త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.