ఉప్పెన ,మహారాజతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి.ఇక ఈహీరో నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా తలైవా తలైవి.ఇందులో నిత్యా మేనన్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈసినిమా కు ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తెలుగులో సార్ మేడమ్ గా విడుదలకానుంది. ఈసందర్భంగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలై.. భార్యభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి.టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్ కనిపించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
టీజర్ లో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. డైరెక్టర్ పాండిరాజ్ ఫ్యామిలీ జానర్ లో ఒక యూనిక్ స్టొరీతో వస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టైటిల్ టీజర్ కి సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ చిత్రంలో యోగి బాబు, RK సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సార్ మేడమ్ ఈ నెల 25న థియేటర్లో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























