పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ టీజర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఫస్ట్ టైమ్ ఈ తరహా పాత్రలో కనిపిస్తున్న ఆయన, ఇందులో తన వాయిస్ మాడ్యులేషన్‌తో థ్రిల్ పంచాడు.
ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రభాస్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ స్టూడియోని సందర్శించాడు. ఈ సందర్భంగా తమన్ భుజంపై చేయివేసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజిచ్చాడు ప్రభాస్. కళ్ళకు గాగుల్స్, బ్లాక్ కలర్ షర్ట్, బిస్కట్ కలర్ పాంటులో కనిపించిన ప్రభాస్ ఆకట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు ప్రభాస్ లుక్ కూడా వైరల్ అవుతోంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ రెబెల్ స్టార్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























