తండేల్ కి సాలిడ్ టీఆర్పీ  

Thandel Gets a Massive TRP in it's World Television Premier

ఫిబ్రవరిలో నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ రిలీజై  సూపర్ హిట్ సాధించింది.ఈసినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం నాగ చైతన్య  100కోట్ల క్లబ్ లోకీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా బుల్లి తెర మీద కూడా  సెన్సేషనల్ హిట్ అయ్యింది. రీసెంట్ గా జీ తెలుగులో తండేల్ ప్రీమియర్ పడగా 10.15 టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఈఏడాది  సంక్రాంతికి వస్తున్నాం తరువత జీ తెలుగులో అత్యధిక రేటింగ్స్ ను రాబట్టిన సినిమాగా తండేల్ రికార్డు సాధించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి ఇచ్చిన పాటలు ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈసినిమాను నిర్మించారు. 

ఇక ఎట్టకేలకు  తండేల్ తో కం బ్యాక్ ఇచ్చిన  నాగ చైతన్య ప్రస్తుతం తన 14వ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా  సెకండ్ షెడ్యూల్  స్టార్ట్ అయ్యింది. మైథికల్ థ్రిల్లర్ గా  కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నాగ చైతన్య స్టైలిస్ట్ లుక్ లో కనిపించనుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. 

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.