జూనియర్ ట్రైలర్ రిలీజ్

Kireeti and Sreeleela's Junior Trailer Released

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. ఆయన సరసన ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలకానుంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్‌గా సెంథిల్ కుమార్ వంటి స్టార్ టెక్నీషియన్స్ పనిచేయడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనికితోడు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతుండడంతో సినిమాపై మార్కెట్‌లో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఇందులో కిరీటి, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు వేశారు. శ్రీలీల సూపర్ డాన్సర్ అన్న విషయం తెలిసిందే. అయితే మొదటిసినిమానే అయినా కిరీటి కూడా దుమ్మురేపే డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి గ్రేస్, ఈజ్‌తో ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇది దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి చేతులమీదుగా డిజిటల్ లాంచ్ కావడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే సినిమాను కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు తెలుస్తోంది. కిరీటి నటన చూస్తుంటే తొలిసినిమా అనే ఫీల్ కలగడంలేదు. శ్రీలీల నేటితరం యువతిగా కనిపించి ఆకట్టుకుంది. వీరి జోడీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

కాగా రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ నటి జెనీలియా, కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో కిరీటి రెడ్డి సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఈనెల 18న జూనియర్ థియేటర్లలోకి రానుంది. సోలోగా విడుదలకానుండం సినిమాకు ప్లస్ అవ్వనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.