యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ తరువాత మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే.అందులో రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈకాంబో మరో సారి రిపీట్ కానుంది.అయితే ఈసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రేపు లాంఛ్ కావాల్సివుండగా అనివార్యకారణాల వల్ల వాయిదాపడింది.త్వరలోనే మరో డేట్ ను ప్రకటించనున్నారు.సినిమా ఓపెనింగ్ రోజు మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.ఇక ఈసినిమా తోపాటు విజయ్ ,రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో 13వ సినిమా చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనుండగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రానుంది.తర్వలోనే ఈసినిమా కుడా స్టార్ట్ కానుంది.విజయ్ ఈరెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు
ఇక విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ ను ప్రమోట్ చేసే పనిలో వున్నాడు.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈసినిమా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో కింగ్డమ్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























