భారతీయ సినీ చరిత్రలో ఓ గొప్ప మైలురాయి వంటి చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. తొమ్మిది దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన చిత్రం ఇది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో సరికొత్త చరిత్ర సృష్టించి, తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి అసలు సిసలు బ్లాక్ బస్టర్ అనే పదానికి నిర్వచనంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2015 జూలై 10న విడుదలైన ఈ సినిమా నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. శివుడు మరియు అమరేంద్ర బాహుబలి పాత్రలతో ప్రభాస్, దేశవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే ఇందులో కీలక పాత్రలు పోషించిన రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కూడా విశేష ప్రేక్షకాదరణ పొందారు.
ఇక దర్శకుడు రాజమౌళి తన అసాధారణ విజన్‌తో వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. ఈ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక్కడ బాహుబలి సంగీతం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో మరియు యుద్ధ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది.
కథ, కథనం, క్యారెక్టర్స్, విజువల్స్, ఎమోషన్స్, గ్రాఫిక్స్.. ఇలా అన్నింటిలోనూ ఈ మూవీ ఒక సరికొత్త ప్రమాణాలను స్థాపించింది. ఈ సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న.. ‘కట్టప్ప’ బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడం గమనార్హం. దాదాపు 5 కోట్ల మంది ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు బారులు తీరారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అనేది. దాదాపు రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ విజయంతో జాతీయ స్థాయిలో బాహుబలి పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం మూవీ లవర్సే కాదు, సాధారణ ప్రజలు సైతం విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. ఈ నేపథ్యంలో వచ్చిన సీక్వెల్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ అయితే ప్రపంచ వ్యాప్తంగా రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, అత్యధిక వసూళ్లు సాధించిన రీజినల్ ఫిలింగా నిలిచింది. కొందరు విదేశీయులు అయితే ఏకంగా ఫ్లైట్స్ బుక్ చేసుకుని, తమ కుటుంబ సభ్యులతో సహా ఇండియాకి వచ్చి దీనిని వీక్షించారు.
చెప్పాలంటే.. బాహుబలి చిత్రం కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక విజయం కూడా. దేశవ్యాప్తంగా ఎన్ని భాషలున్నా ప్రతి ఒక్కరినీ కదిలించింది, ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ఇంతటి చరిత్ర కలిగిన బాహుబలి వచ్చి పదేళ్లు అయినా, ఇప్పటికీ దీని ప్రభావం ప్రజల మనసుల్లోంచి చెక్కుచెదరలేదు. ఇది కేవలం సినిమా కాదు – భారతీయ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే దృశ్యకావ్యం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























