కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ రిలీజ్

Rana Daggubati Presenting Kothapallilo Okappudu Trailer Released

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సహించడంలో భాగంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు సపోర్ట్‌ని ఇచ్చేందుకు తన హోం బ్యానర్ స్పిరిట్ మీడియా ద్వారా అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఈసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించిన యంగ్ ప్రొడ్యూసర్ ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కురాలిగా మారింది. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు థియేట్రికల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలావుంది. ట్రైలర్‌ గమనిస్తే.. లోకల్ రికార్డ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ అయిన రామకృష్ణ సావిత్రిని ప్రేమిస్తాడు. ఒక రోజు, సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది. రామకృష్ణ చాలా ఉత్సాహంగా వెళ్తాడు. కానీ ప్రేమకథ ఇక్కడ షాకింగ్ మలుపు తిరుగుతుంది. అతని జీవితాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఆ క్షణం నుండి ఊహించని మలుపులతో ఒక మిస్టీరియస్ డివైన్ ఎలిమెంట్ తెరపైకి రావడం చాలా ఇంట్రస్టింగ్‌గా వుంది.

గురుకిరణ్ బతులా రాసిన ఈ కథ ఊహించని థ్రిల్లింగ్ అంశాలతో చిత్రానికి ప్రత్యేకమైన ప్లేవర్‌ని తీసుకొచ్చింది. ప్రవీణ పరుచూరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. కీలకమైన పాత్రను కూడా పోషించారు. లీడ్ పెయిర్ మనోజ్ చంద్ర, మోనికా టి తమ పాత్రలకు కొత్తగా నిజాయితీగా ఉంటూ ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాయి. రవీంద్ర విజయ్ అప్పన్నగా తన ప్రెజెన్స్‌ని చాటుకున్నారు. అలాగే ట్రైలర్‌లో ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి.

ఇక సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్ గ్రామీణ నేపథ్యాన్ని అందంగా చూపించారు. వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం పర్ఫెక్ట్ గా వుంది. పాటలను మణి శర్మ స్వరపరిచారు. నిర్మాణ విలువలు జోనర్ కి తగ్గట్టు మంచి క్యాలిటీలో వున్నాయి. ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది.

కాగా ఈ సినిమాతో హీరో మనోజ్ చంద్ర సహా మోనికా టి, ఉషా బోనెల వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతుండగా.. రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.