డిఫ్రెంట్ కాన్సెప్ట్ వున్న సినిమాలు ఎంచుకుంటూ కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చే హీరోల్లో తమిళ హీరో కార్తీ ముందు వరసలో ఉంటాడు.ఇప్పటివరకు కార్తీ 28 సినిమాలు చేయగా అందులో డైరెక్టర్లను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ.ఇక ఈరోజు 29వ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమా కూడా పెద్దగా అనుభవం లేని డైరెక్టర్ తమిళ్ కు ఛాన్స్ ఇచ్చాడు.ఇక ఈ సినిమాకు మార్షల్ అనే టైటిల్ ఖరారు చేశారు.కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటించనుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యకార్ సంగీతం అందించనున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కార్తీ నెక్స్ట్ సర్దార్ 2 తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.సూపర్ హిట్ సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. మిత్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్,రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు. ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక కార్తీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఖైదీ కి సీక్వెల్ కూడా చేయాల్సివుంది. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ ఫినిష్ చేసే పనిలో వున్నాడు. ఈసినిమా రిలీజ్ తరువాత ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టనున్నాడు.అన్ని కుదిరితే డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























