ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్వశక్తితో ఎదిగిన ట్యాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కడపకు చెందిన కిరణ్ తొలుత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆపై డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఇక రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ ‘క’ సినిమాతో తొలిసారి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. అయితే ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సొంత ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పినట్లు ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు.
దీనిలో భాగంగా ఈ బ్యానర్‌లో తొలి ప్రాజెక్టుగా ఓ కంటెంట్ బేస్డ్ మూవీ నిర్మిస్తోన్నాడు. ఈ చిత్రం ద్వారా తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా పరిచయం చేయనున్నాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఫిల్మ్ అప్డేట్స్ వెల్లడించనున్నారు కిరణ్ అబ్బవరం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























