సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

Star Boy Siddu Jonnalagadda's New Film Titled Bad Ass

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది ‘టిల్లు స్క్వేర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఈ యేడాది ‘జాక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీని తర్వాత సిద్దు రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాను ప్రకటించాడు సిద్దు జొన్నలగడ్డ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ప్రకటించారు. కాగా ఈ చిత్రానికి ‘బ్యాడ్ యాస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా నేడు అధికారికంగా ప్రకటించారు. కాగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించనున్నాడు. కాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది.

ఇంతకుముందు ఈయన సిద్దు జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమా చేశాడు. తొలుత డైరెక్ట్ ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌ని ఆకట్టుకుని మంచి హిట్ అనిపించుకుంది. అయితే ఆ తర్వాత స్టార్ హీరో రానా దగ్గుబాటి ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ‘బ్యాడ్ యాస్’ కోసం సిద్దు జొన్నలగడ్డ, రవికాంత్ పేరేపు కలిసి పనిచేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.