వరసగా రెండు బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.అందులో భాగంగా గత ఏడాది తమిళ సినిమా అమరన్ తో రాగ ఈసినిమా 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఇక ఈసినిమా తరువాత తెలుగులో నాగ చైతన్య తో తండేల్ చేసింది.ఈ ఫిబ్రవరి లో వచ్చిన ఈసినిమా 100 కోట్ల వసూళ్లతో హిట్ అందుకుంది.అయితే ఈ సక్సెస్ ల తరువాత సౌత్ లో మరో సినిమా ఒప్పుకోలేదు సాయి పల్లవి.ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఏక్ దిన్ తో హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి.సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తుండగా తనకు జంటగా సాయి పల్లవి కనిపించనుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.నవంబర్ 7న రిలీజ్ కానుంది.సునీల్ పాండే డైరెక్ట్ చేస్తుండగా అమీర్ ఖాన్ ,మన్సూర్ ఖాన్ కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమా కాకుండా సాయి పల్లవి ,ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణలో కూడా నటిస్తుంది.ఇందులో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రణబీర్ కపూర్ ,రాముడిగా ,కన్నడ స్టార్ యష్ రావణాసురిడి గా కనిపించనున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.రామాయణ రెండు పార్టులుగా రిలీజ్ కానుంది.అందులో మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.ఈసినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























