ప్రారంభమైన పూరి-సేతుపతి ప్రాజెక్ట్

Puri-Sethupathi Project Begins Today in Hyderabad

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా, చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్. ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.

ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉండబోతోంది. ఇటీవల తాను తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండటంతో ఈ సినిమాకి సంబధించిన అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు పూరి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేశారు.

పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘బెగ్గర్’ లేదా ‘భవతీ భిక్షాం దేహీ’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ట్రూ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా #పూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.