సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో -మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 157 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.రీసెంట్ గానే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగా రేపటి నుండి మూడో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.ఈనెల 22న ఈ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో 40శాతం షూటింగ్ పూర్తి కానుంది.బ్యాలెన్స్ షూటింగ్ ను అక్టోబర్ లోగా పూర్తి చేసి అనుకున్నదానికంటే ముందుగానే సినిమాను రెడీ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు అయినా రెండు షెడ్యూళ్ల అవుట్ ఫుట్ తో కూడా చిరు ఫుల్ శాటిస్ఫై అయ్యాడట.ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా కన్నా ముందు చిరంజీవి ,విశ్వంభరతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ప్రస్తుతం ఈసినిమా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























