మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). “When haunting turns hilarious!!” అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్, ఆ తర్వాత హైదరాబాద్ అనంతపూర్‌లో రెండు షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కొరియాలో ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో టీం వైబ్రెంట్ హంటింగ్‌లో డ్రాప్స్‌లో స్టన్నింగ్ విజువల్స్‌ని షూట్ చేస్తోంది. ఇది ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ టచ్‌ని యాడ్ చేస్తోంది. ఈ షెడ్యూల్‌తో 80% షూటింగ్ పూర్తవుతుంది. ఈ అద్భుతమైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ రైడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తానికి గ్రాండ్ స్కేల్, స్టైల్, హారర్ బ్లెండ్‌తో VT15 జానర్ డిఫైనింగ్ సినిమాగా వుండబోతోంది.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. గతంలో వరుణ్ ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లో ‘కంచె’ సినిమా చేశారు. అలాగే ‘తొలి ప్రేమ’ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని తీశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























