జూనియర్ సెకండ్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్

Junior second single Viral Vayyari gets super response on youtube

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్.ఇందులో తనకు జంటగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటించడం అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో సినిమాకు బజ్ వచ్చింది.జూనియర్ కన్నడ తోపాటు తెలుగులో కూడా విడుదలకానుంది.ఈనెల 18న థియేటర్లోకి వస్తుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల కిత్రం సెకండ్ సింగిల్ వైరల్ వైయ్యారిని రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ వెర్షన్ కంటే ఎక్కువగా తెలుగు వెర్షన్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ ను రాబట్టుకోవడం గమనార్హం.ఇప్పటివరకు 7 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.దేవి ఈసినిమా కోసం ఎనర్జిటిక్ ట్యూన్స్ ఇచ్చాడు.ఇక ఈ సాంగ్ లో శ్రీ లీలకు పోటీగా కిరీటి స్టెప్పులు వేసాడు.తన డ్యాన్స్ చూస్తుంటే కిరీటి డ్యాన్స్ లో బాగా శిక్షణ తీసుకున్నట్లు వుంది.మరి మొదటి సినిమాతో హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా ,కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైననర్‌గా తెరకెక్కిన ఈసినిమాను నైజాంలో మైత్రి మూవీస్ విడుదలచేస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.