ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు విక్టరీ వెంకటేష్.ఈసినిమా 300 కోట్ల వసూళ్లతో మీడియం బడ్జెట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.అంతేకాదు సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్ కలిగిన హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించారు.ఇక ఈ సినిమా తరువాత వెంకీ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.త్వరలోనే లాంఛ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157లో వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నారు.ఇక దృశ్యం సిరీస్ లో భాగంగా వెంకటేష్, దృశ్యం 3 కూడా చేయనున్నారు. ప్రస్తుతం ఈసినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు డైరెక్టర్ జీతూ జోసఫ్. దృశ్యం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అవ్వగా దృశ్యం 2 డైరెక్ట్ ఓటీటీ లోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో దృశ్యం 3 పై భారీ అంచనాలు వున్నాయి.
ఇవే కాకుండా అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అలాగే బాలకృష్ణ తో మల్టి స్టారర్ లోకూడా నటించనున్నానని అమెరికాలో జరుగుతున్న నాట్స్ ఈవెంట్ లో వెంకటేష్ తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























