కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ రిలీజ్

Rana Daggubati Presenting Kothapallilo Okappudu Teaser Out

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు థియేట్రికల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ టీజర్ అక్కడి యువకుల కలలు, విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయే వరల్డ్ పరిచయం చేస్తుంది. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెదుకుతున్నప్పుడు ఊహించని సమస్యలలో చిక్కుకుంటాడు.

కొత్తపల్లిలో ఒకప్పుడు రిఫ్రెష్‌గా ఉండే రస్టిక్ టోన్‌లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్, గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్‌ ఫన్‌ని ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో మోనికా టి, ఉషా బోనెల కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. టీజర్‌లో పెర్ఫార్మెన్స్‌లో చాలా నేచురల్‌గా ఆకట్టుకున్నాయి. గురుకిరణ్ బత్తుల కథ, సంభాషణలను అందించారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి నెరేటివ్ కి చక్కని సున్నితత్వాన్ని తీసుకువచ్చారు. టీజర్ అయితే అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.