గత నెలలో చిన్న సినిమాగా వచ్చిన తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కోలీవుడ్ లోనే ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమాను నెల రోజుల్లో పూర్తి చేశాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.తనకు ఇదే మొదటి సినిమా.ఇందులో తను స్పెషల్ రోల్ లో నటించాడు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ,హీరో నానిని సైతం ఇంప్రెస్ చేసింది.వీరిద్దరూ సినిమా చూసి డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. ఓటీటీలోకి వచ్చాక తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.ప్రముఖ తమిళ నటుడు శశి కుమార్ ,మిథున్ జై శంకర్ ,సిమ్రాన్ ,యోగలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా సీన్ రోనాల్డ్ సంగీతం అందించాడు.
ఇక మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ అభిషన్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.తన దగ్గర పని చేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ లో హీరోగా సినిమా చేయనున్నాడు.ఈసినిమాలో మలయాళ బ్యూటీ అనస్వరన్ రాజన్ హీరోయిన్ గా నటించనుంది.ఈసినిమాకు కరెక్ట్డ్ మచ్చి అనే టైటిల్ అనుకుంటున్నారట.త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: