బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రయాగ్ రాజ్ లో నిన్నటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 18వరకు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఈషెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.అయితే బాలకృష్ణ నిన్న నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంగం ) నిర్వహిస్తున్న అమెరికా సంబరాల కోసం అమెరికా వెళ్లారు.ఈనెల 14 నుండి తిరిగి ఈ షూటింగ్ లో పాల్గొనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖండ పాన్ ఇండియా రిలీజ్ లేకుండా వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో అఖండ 2 పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఈనేపథ్యంలో నార్త్ ఆడియన్స్ కూడా నచ్చేలా అఖండ 2ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శ్రీను.
ఇందులో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అదే రోజున పవన్ కళ్యాణ్, ఓజీ కూడా రిలీజ్ కానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద అఖండ 2కి భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: