బ్యాక్ టు బ్యాక్ టు హిట్లతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ ఫీట్ సాధించగా ఈఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యి ప్రదీప్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రదీప్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.ఇక ఈసినిమాతోపాటు ప్రదీప్ ప్రస్తుతం డ్యూడ్ అనే సినిమాకూడా చేస్తున్నాడు.
కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.దీపావళికి రానుందని కూడా చెప్పేశారు.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.వరుస హిట్లతో ప్రదీప్ ఫుల్ ఫామ్ లో వుండడంతో నెట్ ఫ్లిక్స్ ఊహించని రేట్ కు ఈ రైట్స్ సొంతం చేసుకుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: