రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పుతో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈనెల 23న సూర్య బర్త్ డే కావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈవిషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కన్ ఫర్మ్ చేశాడు. అంతేకాదు ఈసినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.స్వాసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.సూర్యకి ఈ ఏడాది ఇది సెకండ్ రిలీజ్.సమ్మర్ లో రెట్రోతో రాగ ఈసినిమా కూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.మరి కరుప్పు తోనైనా కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఇక సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: