ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్

Thug Life Streaming Now on OTT

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. దాదాపు 37 సంవత్సరాల తర్వాత వీరి కాంబో రిపీట్ అవ్వడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘నాయకన్’ సూపర్ హిట్ అందుకుంది. ఇక థగ్ లైఫ్ మూవీలో శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో హ్యూజ్ రిలీజ్ అయింది. ‘విక్రమ్’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కమల్ ఆ తర్వాత ‘ఇండియన్ 2’తో నిరాశపరిచారు. ఈ క్రమంలో థగ్ లైఫ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆడియెన్స్‌ని మెప్పించలేకపోయింది.

ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందించిన థగ్ లైఫ్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మాతృక తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సో, మూవీ లవర్స్, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోండి.

థగ్ లైఫ్ కథ ఏంటంటే..?

కథ 1994 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. రంగరాయ శక్తివేల్‌ (కమల్ హాసన్) ఒక గ్యాంగ్‌స్టర్. ఒకసారి గిరిజన గన్ ఫైట్ టైమ్‌లో అమర్ అనే 4 సంవత్సరాల పిల్లవాడిని అతడు కాపాడతాడు. అయితే ఈ ఘర్షణలో అమర్ తండ్రి చనిపోతాడు. దీంతో శక్తివేల్‌ అమర్‌ని తన వద్దే ఉంచుకుని పెంచి పెద్ద చేస్తాడు. ప్రస్తుతానికి వస్తే, శక్తివేల్‌ మరింత పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అవుతాడు. అమర్ (శింబు) అతని కుడి భుజంగా వ్యవహరిస్తుంటాడు.

ఈ నేపథ్యంలో ఒక కేసు విషయంలో శక్తివేల్‌ని అరెస్ట్ చేశాడు. దీంతో అమర్ ఢిల్లీలోని ఒక రాజకీయ నాయకుడైన సదానంద్ (మహేష్ మంజ్రేకర్)తో చేతులు కలుపుతాడు. అయితే ఇది శక్తివేల్‌కి ఇష్టం ఉండదు. దీని తర్వాత ఒకరోజు శక్తి మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. ఈ ఎటాక్ వెనుక అమర్‌ ఉన్నాడని అనుమానిస్తాడు. ఇక్కడినుంచి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.

అయితే వీరి మధ్య వైరం చివరికి ఎటు దారితీసింది? నిజంగానే శక్తివేల్‌ అనుమానించినట్టు అమర్ ఈ ఎటాక్ చేయించాడా? సదానంద్ అంటే శక్తికి ఎందుకు పడదు? పోలీసు అధికారి సాల్మన్ (అశోక్ సెల్వన్) ఎలాంటివాడు? అదే కథ. శక్తివేల్‌ జీవితంలోని ఇంద్రాణి, లక్ష్మి (అభిరామి), మాణిక్యం (నాజర్), జోజు జార్జ్ పాత్రలేంటి? చివరికి శక్తివేల్‌, అమర్ తిరిగి కలుసుకున్నారా? అన్నదే మిగతా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.