రామాయణం గ్లింప్స్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పురాణ పురుషుడు శ్రీరాముడిగా, ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి జానకీ మాతగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రామాయణం’. ‘కేజీఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడుగా కీలక పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ చిత్రం మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా ముగిసినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రామాయణం నుంచి మేకర్స్ ఈరోజు ‘ద ఇంట్రడక్షన్’ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలు గౌరవించే అవతార పురుషుడి జీవితం మరియు 5,000 సంవత్సరాల క్రితం నిజంగా జరిగినదిగా భావిస్తున్న ‘రామాయణం’ కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలన్న మేకర్స్ తృష్ణకు ప్రతిరూపంగా నిలిచింది.

సకలగుణాభి రాముడి పాత్రలో రణబీర్ కపూర్ లుక్ అదిరిపోయింది. అలాగే యష్ ఆహార్యం లంకాధిపతిగా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రాముని విశ్వాసపాత్రుడైన తమ్ముడిగా వర్ధమాన నటుడు రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్ రామాయణం నెవర్ బిఫోర్ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతుంది. అలాగే రేపు థియేటర్లలో ఇది ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు అర్ధమవుతోంది.

రామాయణం – నిబద్దత కలిగిన జీవన విధానం, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, ఆలుమగల మధ్య ఉండాల్సిన నమ్మకం, ప్రేమ, విపత్కర పరిస్థితులలో మనిషి నడుచుకోవాల్సిన మార్గం, అనుసరించాల్సిన ధర్మం, మంచి-చెడుల మధ్య జరిగే పోరాటం, వంటి విషయాలలో నేటికీ కోట్లాదిమంది ప్రజలకు నిరంతరం గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు ఈ రామాయణం సినిమా వీటన్నిటినీ స్పృశించనుంది.

భరత ఖండంలోని అత్యంత శక్తివంతమైన ఇతిహాసాలలో ఒకటైన రామాయణం, భారతీయ సంస్కృతిలో యుగాలుగా నిలిచిపోయిన గొప్ప చారిత్రిక గాథ. ఇది పురాణాలలోని రెండు అత్యంత శక్తి సంపన్నులైన రాముడు, రావణుడి మధ్య కాలాతీత యుద్ధానికి వేదికగా నిలిచింది. ప్రస్తుత తరంలోని ప్రజల కోసం అత్యాధునిక సినిమాటిక్ వరల్డ్‌గా సృష్టించబడుతోంది.

కాగా ఈ సినిమా హాలీవుడ్ మరియు భారతదేశంలోని కొంతమంది ప్రముఖుల ప్రతిభతో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రూపొందుతోంది. నటుడు యష్ ఈ సినిమాకి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం. దార్శనిక చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా నేతృత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ మరియు 8 సార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న VFX స్టూడియో DNEG, యష్ యొక్క మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మించారు. IMAX కోసం చిత్రీకరించబడుతోన్న రామాయణం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.