సూపర్ స్టార్ రజినీకాంత్ – యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇప్పటికే ఈసినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది.థియేట్రికల్ రైట్స్ అయితే భారీ ధర పలుకుతున్నాయి.ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోగా తెలుగులోకూడా సాలిడ్ బిజినెస్ చేసింది.ప్రముఖ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సత్య రాజ్ ,శృతి హాసన్ లతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.దాదాపు 8 నిమిషాలు అమీర్ ఇందులో కనిపించనున్నాడట.ఈరోజు అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అమీర్‌ఖాన్ ని దహా అనే రోల్ లో కనిపించనున్నాడు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్ ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.అమీర్ ఉండడం తో హిందీలోనూ ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ కానుంది.
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజున హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుండడంతో తెలుగు,హిందీలో కూలీకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: