పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’.జూలై 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో నేడు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితం హైదరాబాద్ లోని విమల్ థియేటర్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు ఏఎం రత్నం, దయాకర్ రావు, డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.ఇక ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది.ముఖ్యంగా పవర్ స్టార్ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్‌ని గమనిస్తే.. దీనికి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన తన గాత్రంతో ఆయన వీరమల్లు పాత్ర గురించి వివరిస్తుంటే పూనకాలు వచ్చేలావుంది.3 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఘట్టాలతో అదిరిపోయింది. మొత్తం 140 షాట్స్, ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయి.ప్రధానంగా విజువల్స్ అయితే ఐ ఫీస్ట్ లాగా ఉన్నాయి.
ఇక ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఆయన ఎలా ఉంటారా? ఆయన పాత్ర ఎలా ఉంటుందా? అని ఎదురుచూసిన ఆయన అభిమానులకు ఈ ట్రైలర్ ఆ లోటును తీర్చేలాఉంది. ఆయన కనిపించిన ప్రతి షాట్ అత్యద్భుతంగా ఉంది.పోరాటయోధుడైన వీరమల్లు పాత్రలో పవన్ చెలరేగిపోయారు.ఆయన లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, నభూతో.. అన్నట్టుగా ఉన్నాయి.
ట్రైలర్ చూస్తుంటే, వీరమల్లు మూవీ ప్యూర్ సినిమాటిక్ అడ్రినలిన్‌గా ఉండబోతోందని అర్ధమవుతోంది.యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా జ్యోతికృష్ణ ,క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: