దీనస్థితిలో సినీ నటి.. పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

AP DCM Pawan Kalyan Gives Financial Aid To Actress Vasuki

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన డిప్యూటీ సీఎం రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ గారు, పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు సీనియర్ నటికి అందజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. తనకన్నా పవన్ చిన్నవాడైనా ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు పాకీజా.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.