యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే

Vijay Deverakonda Calls For Say No To Drugs

“యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే” అని పేర్కొన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఒకసారి వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక బైట్ అడిగితే ఇచ్చాను. అప్పుడు నాకు అంత సీరియస్ గా ఈ సమస్య గురించి అవేర్నెస్ లేదు. కానీ కొంతకాలం తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇది ఎంత పెద్ద సమస్యో చెప్పిన తర్వాత తప్పకుండా ఈ విషయంలో అవేర్నెస్ కల్పించాలనిపించింది. ఎవరు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయకూడదు. ఇది మన బాధ్యతలాగా అనిపించింది.”

“మనకి మన హెల్త్ ముఖ్యం. హెల్త్ లేకపోతే ఏమీ చేయలేం. యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే. ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంకా జీవితంలో మరో లక్ష్యం అంటూ ఉండదు. మన దేశం మనం నెంబర్ వన్ లో ఉండాలంటే డ్రగ్స్ ని రానివ్వకూడదు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఆనందం కావాలంటే వ్యాయామం చేయండి. డబ్బులు సంపాదించండి. అప్పుడు సమాజం గౌరవిస్తుంది. మన పేరెంట్స్ గర్వపడతారు. అందరికీ థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.