‘డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం. డ్రగ్స్‌ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లా మారుదాం’ అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి, మై బ్రదర్ విజయ్ దేవరకొండ కి, దిల్ రాజ్ గారికి మిగతా పెద్దలందరికీ థాంక్యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి హాయ్.”
“నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వెళ్లేవాడిని. ఇక్కడ మీ అందరిని చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖకు ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ కచ్చితంగా కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట గోలి సోడాలు చాక్లెట్లు దొరికే చోట డ్రగ్స్ అమ్ముతున్నారని వార్తలు చూసి చాలా షాక్ అయ్యాను.”
“ఇది ఇంత పెద్ద ఆర్గనైజడ్ క్రైమ్ లాగా అయిపోయిందా అని చాలా బాధేసింది. అప్పుడు నేను పేరెంట్ ని కాదు. ఇప్పుడు పేరెంట్ ని. రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటికి పంపించాలంటే భయంగా ఉంటుంది. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. పొద్దున్నే లేచి వ్యాయామం చేసి, మన వర్క్ పూర్తి చేసి. ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలో రియల్ హై ఉంటుంది.”
“ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు ఒక హై ఉంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం హై. గేమ్స్ ఆడటం ఒక హై. మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడాలి. మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. మేము అందరం తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాం. డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగా మారాలి. అందరికీ థాంక్ యూ” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























