కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫీనిక్స్’. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. జూలై 4న ఫీనిక్స్ గ్రాండ్ థియేట్రికల్ విడుదలకానుంది. ఇది సూర్య సేతుపతి పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కాగా, గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ వంటి చిత్రాల్లో స్మాల్ రోల్స్ లో కనిపించాడు. ఫీనిక్స్ తో హీరోగా డెబ్యు చేస్తున్నారు.
ఇక ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ ‘ఇంధ వంగికో’ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సామ్ సిఎస్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ, డీఓపీ వెల్రాజ్ అందించిన కలర్ ఫుల్ విజువల్స్, సూర్య సేతుపతి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా విజయ్ సేతుపతి స్వయంగా ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























