కూలీ.. హిందీలో టైటిల్ మారింది

Superstar Rajinikanth's Coolie Movie Title Changed as Majdoor in Hindi

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. కింగ్ నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగావుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే రజినీ బర్త్ డే సందర్భంగా ‘చీకిటు వైబ్’ పేరుతో విడుదలచేసిన స్పెషల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది.

కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే అన్ని భాషల్లోనూ కూలీ పేరుతోనే సినిమా విడుదలవుతుండగా.. హిందీలో మాత్రం సినిమా టైటిల్ మార్చబోతున్నారు. హిందీలో ‘మజాదూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే హిందీలో కూలీ పేరుతో 3 చిత్రాలు విడుదలయ్యాయి.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కూలీ’ 1983లో వచ్చింది. ఇక 1995లో గోవిందా హీరోగా కూలీ నెం. 1 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే టైటిల్‌తో యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ 2020లో విడుదలైంది. ఇలా ఒకే పేరుతో మూడు సినిమాలు వచ్చేసిన కారణంగా, ప్రస్తుతం రజినీకాంత్ కూలీ సినిమా హిందీలో ‘మజాదూర్’ పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్.

సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు రూ 250 కోట్ల బడ్జెట్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రూ. 1000 కోట్లు వసూలు టార్గెట్‌గా కూలీ బరిలోకి దిగనుంది.

కూలీ ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 14న ‘వార్ 2’ కూడా విడుదలకానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈ సినిమాకు భారీ హైప్ వుంది. దాంతో కూలీకి తెలుగులో గట్టి పోటీ ఎదురుకానుంది. తమిళంలో మాత్రం వార్ 2 ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు.

ఇక రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ‘జైలర్’ కూడా ఆగస్టు నెలలోనే విడుదలైంది. మరి ఆ సెంటిమెంట్ కూలీకి కలిసొస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాకు వున్న హైప్ దృష్ట్యా తెలుగు రైట్స్‌కు నిర్మాత భారీ ధర చెప్తున్నారట. లోకేష్ కనగరాజ్ చేసిన చివరి రెండు చిత్రాలు ‘విక్రమ్, లియో’ తెలుగులోకూడా భారీ లాభాలను తీసుకొచ్చాయి. దాంతో కూలీ రైట్స్‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.