కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ చివరి సినిమాగా వస్తోన్న చిత్రం ‘జన నాయగన్’. ‘ఖాకి’ ఫేమ్ హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్ కే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన విజయ్ పోస్టర్స్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న విజయ్ బర్త్ డే సందర్భంగా జన నాయగన్ నుండి ‘ఫస్ట్ రోర్’ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 65 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్‌ని గమనిస్తే.. ‘నా హృదయంలో ఉండే..’ అంటూ సాగే విజయ్ మాటలతో మొదలైంది.
పోలీస్ డ్రెస్‌లో విజయ్ చేతిలో కత్తితో ఇంటెన్స్ లుక్‌తో నడుస్తూ రావడం హైలైట్ అనిపించింది. చుట్టూ మంటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కనిపిస్తోంది. విజయ్ యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నట్టుగా వుంది. చివరిలో రక్తమోడుతున్న కత్తితో మీసం తిప్పడం గ్లింప్స్‌కే హైలైట్ గా నిలిచింది. ఇక అనిరుద్ రవిచందర్ అందించిన బీజీఎమ్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తానికి ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, నరైన్, ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు తెలుగులోకూడా రిలీజ్ చేస్తే ఈ సినిమా భారీ పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి టార్గెట్ గా తెలుగు నుండి భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ ను తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
ఇదిలావుంటే ఈ చిత్రంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంటరైన ఆయన సొంతంగా ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని పోటీలోకి దింపనున్నాడు. దీంతో సినిమాలు ఆపేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: