పెద్ది.. టెర్రిఫిక్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్

Global Star Ram Charan Filmed A Terrific Night Action Sequence For Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు ఈ చిత్రానికి డీవోపీగా పనిచేస్తున్న స్టార్ కెమెరామేన్ రత్నవేలు ‘పెద్ది’ సెట్స్ నుంచి ఒక పవర్ ఫుల్ మోమెంట్‌ను షేర్ చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ తో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. కాగా రత్నవేలు షేర్ చేసిన స్టిల్ లో రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలెట్ గా ఉండబోతోంది.

ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.