కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో జూన్ 20న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మార్నింగ్ షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరుగగా.. సినిమా యూనిట్ అంతా హాజరై సందడి చేసింది.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. లవ్ యూ చిరంజీవి గారు. మంచి సినిమాని భుజాన వేసుకొని ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. మా మ్యూజిక్ టీంకి పేరుపేరునా థాంక్ యూ. నందకిషోర్ చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. ఆయన ప్రతిభ అందరికీ తెలియాలి. భాస్కర్ భట్ల, చంద్రబోస్ గారికి థాంక్ యూ. నికేత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నిర్మాత సునీల్ నారంగ్ గారు స్టూడియోకి వస్తే చాలా సందడిగా వుంటుంది. సినిమా రిలీజ్‌కు ముందే మొత్తం పేమెంట్ ఇచ్చేశారు (నవ్వుతూ)” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సమీర పాత్రలో రష్మిక అద్భుతంగా చేసింది. తను విజయాల్ని కొనసాగించడం ఆనందంగా వుంది. ఈ కథని ధనుష్ గారు ఒప్పుకోవడమే సక్సెస్. ఈ సినిమాతో ఆయనకి మరో నేషనల్ అవార్డ్ వస్తుంది. నాగ్ సర్ ఎవర్ గ్రీన్ ‘మన్మథుడు’. ఇందులో దీపక్ పాత్ర ఆయన తప్పితే మరొకరు చేయలేరు. శేఖర్ గారు అద్భుతంగా సినిమా తీశారు. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: